కేటీఆర్ నీకు సంస్కారం ఉందా: ఎమ్మెల్యే భూపతి రెడ్డి

– బీఆర్ఎస్ నాయకుల్లారా.. సంస్కారం నేర్చుకోండి!
– బీజేపీ రాముడు పేరుతో ఓట్లు అడిగే కుట్ర..
– ఏ సమస్య ఉన్నా   అందుబాటులో ఉంటా.. సమస్యలను పరిష్కారిస్తా..
నవతెలంగాణ  – డిచ్ పల్లి
ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని కాలిగోటికి సరిపోవు అని వ్యాఖ్యానిస్తావా!.. ఖబర్దార్ బిఆర్ఎస్ నాయకుల్లారా.. సంస్కారం నేర్చుకొనిరా! ముందు.. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎదురు దాడి చేస్తారు జాగ్రత్త హెచ్చరించిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి అన్నారు. ఇందల్ వాయి మండలంలోని  మారుమూల గ్రామమైన గౌరారం గ్రామంలో ప్రత్యేక ధన్యవాదాలు తెలిపే కార్యక్రమంలో హాజరై ఆంజనేయ స్వామి గుడిలో పూజలు చేశారు.. ఈ సందర్భంగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డిని సర్పంచ్ ఇమ్మడి లక్ష్మి ముదిరాజ్, దర్పల్లి మాజీ ఎంపీపీ, ముదిరాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఇమ్మడి గోపి ముదిరాజ్ అద్వర్యంలో మహిళలు భారీ ఎత్తున బోనాలు,డప్పు వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికి ఆహ్వానించారు. గ్రామంలోని గ్రామ పంచాయతీ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రాముడి పేరుతో జపం చేస్తూ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తుందని బిజెపి పుట్టక ముందు నుండే ప్రతి ఇంట్లో ఉన్న రాముడికి పూజించేవారని దీనిలో ప్రత్యేకత ఏముందని ప్రశ్నించారు. రామరాజ్యం పేరిట డ్రామాలు ఆడడం ఆపాలని ప్రజలంతా అమాయకులు కారని పేదలకు నిరుపేదలకు కావాల్సింది చేయక రామజాపం చేయడం ఏంటని ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసిన వేయకుండా ప్రజలందరూ నా వారేనని అర్హులైన ప్రతి ఒక్కరికి కులం మతం పార్టీలకతీతంగా లబ్ధి చేకూర్చడమే తన ధ్యేయమన్నారు.పది ఏళ్ళ క్రితం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి కెసిఆర్ కుటుంబ సభ్యులు దోపిడికి పాల్పడ్డారని, అభివృద్ధి శూన్యమన్నారు. సోనియా గాంధీ నాయకత్వంలో తెలంగాణ ప్రజలు  ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చారని అన్నారు. గౌరారం ప్రజలు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీ ఇచ్చారని తను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపడానికి వచ్చానని అన్నారు. గ్రామంలో సమస్యలు పరిష్కరించడానికి తాను కృషి చేస్తానని 180 సర్వే నంబర్ గాల భూమిని రి సర్వే చేయించి ప్రతి పేదలకు, రైతులకు భూ పంపిణీ చేసి పట్టాలు అందించే ప్రయత్నం చేసి  సహకరిస్తానన్నారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 50 రోజులు కాకున్నా టిఆర్ఎస్ నేతలు అవాకులు చవాకులు పేలుతున్నారని రాజకీయ అనుభవం ఉందని చెబుతున్న కేటీఆర్ కూడా దుర్భరమైన భాష వాడుతున్నారని, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారం కోల్పోవడంతో మానసికంగా మెదడు అదుపుతప్పి ముఖ్యమంత్రి పై దురుసుగా వ్యాఖ్యలు చేస్తున్నారని ఈ పద్ధతి మానుకోవాలని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల సంక్షేమం కొరకే అధికారంలోకి వచ్చిందని 6 గ్యారంటీ పథకాలను తప్పకుండా అమలు చేసి సుపరిపాలన అందిస్తామని అన్నారు.గ్రామంలో నెలకొని ఉన్న సమస్యలను సర్పంచ్ ఇమ్మడి లక్ష్మి గోపి ముదిరాజ్ మాజీ మండల పరిషత్ ఫ్లోర్ లీడర్ సంతోష్ రెడ్డిలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని వచ్చారు. డ్రైనేజీలు, కల్వర్టులు, రహదారులు, గ్రామంలో కమ్యూనిటీ భవనాలు, డబుల్ రోడ్డు నిర్మాణం తదితర వాటిని దృష్టికి తీసుకుని వచ్చిన వెంటనే సమస్య ఏదైనా ఒక్కొక్కటిగా పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. గత ఐదేళ్ల క్రితం నిర్మించిన గ్రామపంచాయతీ భవనం ప్రారంభోత్సవానికి మాజీ ఎమ్మెల్యే వెనుకడుగు వేశారని గ్రామపంచాయతీ గ్రామ ప్రజలందని ఎందుకు ప్రారంభించలేదని ప్రశ్నించారు. అంతకుముందు గ్రామపంచాయతీ పాలకవర్గం కు ప్రశంస పత్రాలను అందజేశారు వారు చేసిన సేవలను కొనియాడారు. రామా అభివృద్ధికి అందరు కలిసికట్టుగా ఉండి అభివృద్ధి చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఇందల్ వాయి మండల కాంగ్రెస్ అధ్యక్షులు మోత్కురి నవీన్ గౌడ్, పిసిసి డెలిగేట్ శేఖర్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ముప్ప గంగారెడ్డి, కిసాన్ ఖెత్ మండల అధ్యక్షులు ఎల్ ఐ సి గంగాధర్, డిసిసి డెలిగేట్ సుధాకర్, మహిళా అధ్యక్షురాలు జంగిలి లక్ష్మి, కాంగ్రెస్ నాయకులు వెంకట్ రెడ్డి,ఉప సర్పంచ్ గోద స్వామి,ఎన్ ఎస్ యుఐ రూరల్ కన్వీనర్ ఆశిష్,కర్స మోహన్, కరుణాకర్, గౌరారం గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, మహిళలు, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Spread the love