మృతురాలి కుటుంబానికి ఎమ్మేల్యే సీతక్క పరామర్శ

నవతెలంగాణ-గోవిందరావుపేట
మండలంలోని చల్వాయి గ్రామానికి చెందిన చింతకాయల రాజశేఖర్ తల్లి సోమవారం అనారోగ్యంతో మృతిచెందగా ములుగు ఎమ్మెల్యే సీతక్క రాజశేఖర్ కుటుంబాన్ని పరామర్శించి సానుభూతి వ్యక్తం చేశారు. అనంతరం రాజశేఖర్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించి కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా మీ కుటుంబానికి అండగా ఉండి ఆదుకుంటుందని భరోసా కల్పించారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ చాపల ఉమాదేవి – నరేందర్ రెడ్డి, వార్డు నెంబర్ ఏదుల రాధిక, పొన్నం సాయి, సామ శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Spread the love