నవతెలంగాణ-ఐనవోలు
ప్రజల భద్రతే ప్రధాన కర్తవ్యంగా పోలీస్ వ్యవస్థ కృషి చేస్తోందని బీఆర్‌ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు. ఐనవోలు మండల కేంద్రంలోని శ్రీ మల్లికార్జున ఫక్షన్ హలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవలలో భాగంగా పోలీస్ శాఖ, పోలీస్ కమిషనర్ ఏవి రంఘనాథ్ ఆధ్వర్యంలో చేపట్టిన సురక్ష దినోత్సవ కార్యక్రమాలకు ఎమ్మెల్యే అరూరి హాజరై పోలీస్ వాహనాల ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. అనం తరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ పెరుగుతున్న జనాభా, నేరాలు, సైబర్ క్రైమ్ వంటి సాంకేతికతో ముడిపడి ఉన్న నేరాల వంటి సవాళ్ళను సైతం ఎదుర్కునేందుకు తెలంగాణ ప్రభుత్వం సర్వసన్నద్ధమై ఉందని అన్నారు. పోలీస్ ఉద్యోగ నియామకాల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ కల్పించి అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ పటిష్ట నిర్ణయాల వల్ల అరాచక శక్తులు, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న వారిపై ఉక్కు పాదం మోపడం జరుగుతుందని అన్నారు. దేశంలోనే అంతర్జా తీయ ప్రమాణలతో హైదరాబాద్‌లో పోలీస్ కామాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయడం ద్వారా సాంకేతికంగా పోలీసులకు సక్లిష్టమైన కేసులను సైతం పరిష్క రించడం జరుగుతుందని అన్నారు. 7సంవత్సరాలలో పోలీస్ శాఖలో 28వేల 277ఉద్యోగాలను భర్తీ చేయడమే కాకుండా అదనంగా 17వేల 516ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేసినట్లు వివరించారు. డీసిసిబి చైర్మన్ మార్నెని రవీందర్ రావు, ఈస్ట్ జోన్ డీసీపీ కరుణాకర్, ట్రైనీ ఐపీఎస్ అంకిత్, అడిషనల్ డీసీపీ సంజీవ్, మామునుర్ ఏసిపి కపాకర్, కాజీపేట ఏసీపీ శ్రీనివాస్, సిఐలు, ఎస్సైలు, నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, నాయకులు, ప్రజలు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
నెంబర్ వన్ స్థానంలో పోలీసు వ్యవస్థ
శాయంపేట : తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక శాంతి భద్రత కల్పనలో నెంబర్ వన్ స్థానంలో పోలీసు వ్యవస్థ పని చేస్తుందని వరంగల్ జిల్లా జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి అన్నారు. మండలంలోని పత్తిపాక గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్స వాలను పురస్కరించుకొని ఆదివారం సురక్ష దినోత్స వం సమావేశం ఎస్సై ఇమ్మడి వీరభద్రరావు అధ్యక్షత న నిర్వహించగా జడ్పీ చైర్‌పర్సన్ జ్యోతి పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే శాంతి భద్రతలు తగ్గిపోయి, నక్సలిజం పెరిగి మతతత్వం వస్తుందని విమర్శలు కురిపించారని, తెలంగాణ ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ డిఐజీలు అనురాగ్ శర్మ, మహేందర్రెడ్డితో మాట్లాడి పోలీసు వ్యవస్థను ప్రజలకు సన్నిహితం చేసి, ఫ్రెండ్లీ పోలీస్ కార్యక్రమా లతో ప్రజలకు చేరువై, నేరాల నియంత్రణలో తెలం గాణ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ నెంబర్ వన్ స్థానంలో ఉందని అన్నారు. పోలీసులు నేరాలను అరికట్టేందుకు 15 వేల వాహనాలను కొనుగోలు చేసి పోలీసు శాఖకు అందించారని గుర్తు చేశారు. నేరాలు నియంత్రించడం ప్రజలకు భరోసా కల్పిం చడం కట్టుదిట్టమైన భద్రత చర్యలు పోలీసులు చే స్తుండడంతో ఐటీ కంపెనీలు హైదరాబాద్ నగరం లో స్థాపించి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారని అన్నారు. మహిళలకు హెల్ప్ డెస్క్, షీ టీమ్స్, సీసీ కెమెరాలతో నేరస్తులను త్వరితగతిన పట్టుకోవడమే కాక నేరాల నియంత్రలకు పోలీసులు కషి చేస్తున్నారని కొనియాడారు. పరకాల ఏసీపీ జే. శివరామయ్య మాట్లాడుతూ ఫ్రెండ్లీ పోలీసింగ్ తో ప్రజలకు చేరువై బాధితులకు న్యాయం జరుగుతుంద న్నారు. పరకాల సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో 400 మంది యువతకు శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. వైట్ కాలర్ క్రైమ్స్ రేటు తగ్గిస్తున్నట్లు తెలిపారు. సీసీ కెమెరాలు ద్వారా నేరాల నియంత్రణ చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం పోలీసు శాఖ ఆధ్వర్యంలో ముద్రించిన కరపత్రాలను జడ్పీ చైర్ పర్సన్ జ్యోతి విడుదల చేశారు. ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి, తహసిల్దార్ చలమల్ల రాజు, ఎంపీడీవో ఆమంచ కష్ణమూర్తి, స్థానిక సర్పంచ్ చిట్టిరెడ్డి రాజిరెడ్డి నాయకులు పాల్గొన్నారు.