ఊర పండుగ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే 

నవతెలంగాణ – కంటేశ్వర్
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల ఊర పండుగ ఏర్పాట్లను అధికారులు  సర్వ సమాజ్ కమిటీ సభ్యులతో మంగళవారం పరిశీలించారు.
మత సామరస్యానికి ప్రతీక అయిన ఊర పండుగను ఘనంగా శాంతియుతంగా నిర్వహించుకొనేందుకు అన్ని ఏర్పాట్లను చేయాలని అధికారులను ఆదేశించారు.అమ్మవారి గద్దె వద్ద విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని సర్వ సమాజ్ కమిటీ విజ్ఞప్తి మేరకు తక్షణమే నిధులు మంజూరు చేశారు.ఊర పండుగ అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేయలని పోలీస్ అధికారులను ఆదేశించారు.దేవత మూర్తులు ఊరేగింపుగా వచ్చే మార్గాల్లో స్పెషల్ సానిటేషన్ డ్రైవ్ నిర్వహించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో నగర మేయర్  దండు నీతూ కిరణ్, నుడ చైర్మన్  ప్రభాకర్ రెడ్డి, సర్వ సమాజ్ కమిటీ సభ్యులు  బంటు రాజేశ్వర్,రామర్ధి గంగాధర్, రామడుగు బాలకిషన్, పుప్పాల రవి,  బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
Spread the love