పర్యాటక అభివృద్ధితో యువతకు ఉపాది: ఎమ్మెల్యే కడియం

నవతెలంగాణ – ధర్మసాగర్ 
ధర్మసాగర్ దేవనూరు ఇనుపరాధి గుట్టలను పర్యాటక కేంద్రముగా తీర్చిదిద్దితే ఆర్థిక అభివృద్ధితోపాటు యువతి యువకులకు ఉపాధి కల్పన కు సాధ్యపడుతుందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. గురువారం ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధి కార్యాచరణ పై జిల్లా ఇంచార్జ్ మంత్రి, రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార మరియు పౌరసంబంధాల శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన హైదరాబాద్ లోని సెక్రెటరియేట్ లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఉమ్మడి వరంగల్ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య,మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి  పాల్గొన్నారు. ఈ సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ.. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ పరిధిలోని దేవునూరు (ఇనుపరాతి) గుట్టలను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెయాల్సిన అవసరం ఉందని అన్నారు. దేవునూరు (ఇనుపరాతి) గుట్టలలో రోప్ వే, ట్రేకింగ్ మరియు క్యాంపింగ్ సదుపాయాలు కల్పించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. అలాగే హన్మకొండ హంటర్ రోడ్డులోని జూ పార్క్ ను సైతం దేవునూరు (ఇనుపరాతి) గుట్టలలో ఏర్పాటు చేయాలనీ మంత్రిని కోరారు.
దింతో పాటు ధర్మసాగర్ బండ్ ను సుందరికరణ చేయాలని, రిజర్వాయర్ లో వాటర్ స్పోర్ట్స్ కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని గుర్తు చేశారు. ఇది హైదరాబాద్ వరంగల్ హైవే కు దగ్గరలో ఉండడంతో ధర్మసాగర్ బండ్ మరియు దేవునూరు (ఇనుపరాతి) గుట్టలు మంచి పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చెందుతాయని వెల్లడించారు. దీనివల్ల రాష్ట్ర ఆర్థిక అభివృద్ధితోపాటు,స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకు యువతి యువకులకు ఎన్నో రకాల ఉపాధి అవకాశాలు లభిస్తాయని వివరించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  దేవునూరు (ఇనుపరాతి) గుట్టలు మరియు ధర్మసాగర్ బండ్ అభివృద్ధికి వేంటేనే డి పి ఆర్ ( డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్) సిద్ధం చేయాలనీ, కన్సల్టెన్సీ టెండర్లు పిలవాలని సంబంధిత శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Spread the love