మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి

నవతెలంగాణ-ధర్మసాగర్ : మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి  ధర్మసాగర్ మండలం లోని పలు గ్రామాలలో పర్యటించి పలువురి మృతుల కుటుంబాలను ఆదివారం సందర్శించి పరామర్శించారు.ముప్పారం గ్రామంలో గోనెల మల్లయ్య  తల్లి గారు మరియు మోడెం చంద్రమౌళి  ఇటీవల మరణించడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.నారాయణగిరి గ్రామంలో మాజీ ఎంపిటిసీ కుందెళ్ల ఎల్లమ్మ గారి భర్త సారయ్య  మరణించడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. తాటికాయల గ్రామంలో పెసరు స్వామి కూతురు ప్రవళిక మరియు మొగిలిచర్ల మహేందర్  ఇటీవల మరణించడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.పెద్ద పెండ్యాల గ్రామంలో మానుక అనిల్, మామిండ్ల నర్సయ్య గారి భార్య ఇటీవల మరణించడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కరుణాపురం గ్రామంలో శిక ప్రశాంత్ గారు ఇటీవల మరణించడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.మండల కేంద్రంలో కొట్టే శ్రీనివాస్ అనారోగ్యంతో మరణించగ వారి భౌతికయానికి పూలమాల వేసి నివాళులర్పించి నివాళులర్పించారు. వారితోపాటు ఆయా గ్రామాల పార్టీ అధ్యక్షులు కార్యకర్తలు బంధుమిత్రులు పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.
Spread the love