
గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. గురువారం ఆయన స్వగృహంలో బల్దియా అధికారులు, రాంపూర్, ఉనికిచర్ల గ్రామాల ముఖ్య నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాంపూర్, ఉనికిచర్ల గ్రామాలలో సిసి రోడ్లు, సైడ్ డ్రైనేజీలు, త్రాగు నీరు, పెన్షన్లు, స్మశాన వాటికల సమస్యలపై అధికారులు, నాయకులతో చర్చించారు. గ్రేటర్ వరంగల్ 64వ డివిజన్ ఉనికిచర్ల గ్రామంలో పెన్షన్ దారుల సమస్యను వేంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వృద్దులు, వికలాంగులు, మహిళలు ఉనికిచర్ల నుండి కరుణాపురం వెళ్లి పెన్షన్ తీసుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారని ఉనికిచర్ల గ్రామంలో పెన్షన్ ఇవ్వాలని సూచించారు. గ్రామంలో మంజూరు అయిన సిసి రోడ్లు, సైడ్ డ్రైనేజిల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. అదనంగా 30లక్షలతో సిసి రోడ్డు, సైడ్ డ్రైన్ నిర్మాణాలకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అన్నారు. గ్రామంలో త్రాగునీటి సమస్య ఉందని కావున వాటర్ ట్యాంక్ నిర్మాణానికి సైతం ప్రతిపాదనలు సిద్ధం చేయాలి సూచించారు. మరియు ఔటర్ రింగ్ రోడ్డు నుండి ఉనికిచర్ల మెయిన్ రోడ్డును డబుల్ రోడ్డు చేసి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. 46వ డివిజన్ రాంపూర్ లో మాడల్ స్మశాన వాటిక నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణానికి స్థలాన్ని గుర్తించాలని గ్రామస్తులకు సూచించారు. రాంపూర్ లో త్రాగు నీటి సమస్యలు రాకుండా అంతర్గత పైప్ లైన్ నిర్మాణాలను పూర్తి చెయాలనీ అలాగే గ్రామంలో లైన్ మెన్ పని తీరు సరిగా లేదని వెంటనే లైన్ మెన్ ను మార్చాలని అధికారులకు సూచించారు. గ్రామంలో సిసి రోడ్లు, సైడ్ డ్రైన్ ల నిర్మాణాలను వీలైనంత తొందరగా పూర్తి చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో జి డబ్ల్యుఎంసి ఈఈ సంతోష్, కాజీపేట జోన్ డిప్యూటీ కమిషనర్ రవీందర్, ఉనికిచర్ల గ్రామం నుండి మహేందర్, స్వామి, రాజేందర్, బాబు, మధుపాల్ రెడ్డి, రాంపూర్ గ్రామం నుండి హనుమంతరావు, బిక్షపతి, రాజు, ప్రదీప్, దేవేందర్ రావు, ప్రభాకర్, రాజేష్, శ్రీకాంత్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.