బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి

నవతెలంగాణ-రాయపోల్ : రాయపోల్ మండల కేంద్రం తాజా మాజీ సర్పంచ్ కాసుల మౌనిక రాజిరెడ్డి తాతయ్య కాసుల రాజిరెడ్డి అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకొని మంగళవారం వారి కుటుంబ సభ్యులను దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పరమర్శించారు. సీనియర్ నాయకులు కాసుల రాజిరెడ్డి మృతి పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ రాయపోల్ గ్రామ నాయకులు కాసుల రాజిరెడ్డి మృతిచెందడం చాలా బాధాకరమని, తాను అందుబాటులో లేక పోవడంతో అంత్యక్రియాలకు రాలేకపోయినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా రాజిరెడ్డి మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ నివాళులర్పించడం జరుగుతుందని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామన్నారు. ధైర్యంగా ఉండాలని కుటుంబ సభ్యులను ఓదార్చడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రాయపోల్ జడ్పీటీసీ లింగాయపల్లి యాదగిరి, మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వర శర్మ, కో ఆప్షన్ సభ్యులు పర్వేజ్,మాజీ సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు వెంకటనర్సిహ్మరెడ్డి, రాష్ట్ర యువజన నాయకులు హన్మండ్ల రాజిరెడ్డి, మండల నాయకులు కలూరి శ్రీనివాస్, ఇప్ప దయాకర్, మాజీ ఎంపీటీసీ రాజు గౌడ్, నాయకులు సత్యం, వెంకట్ గౌడ్, మురళి గౌడ్, రాంచంద్రం గౌడ్, బాల్ నర్స్, వెంకట్ గౌడ్, రంగారెడ్డి, బార్గవ్, రాజిరెడ్డి,బాగిరెడ్డి ఇస్తారి, మధు తదితరులు పాల్గొన్నారు.
Spread the love