అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

నవతెలంగాణ-ఉప్పల్‌
అబివృద్ధి సంక్షేమ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తున్నదని, అభివృద్ధి జరగాలంటే అది బీఆర్‌ఎస్‌ తోనే సాధ్యమని ఉప్పల్‌ ఎమ్మెల్యే సుభాష్‌ రెడ్డి అన్నారు. శనివారం చిల్కానగర్‌ డివిజన్‌లో రెండు కోట్ల 37 లక్షల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులకు కార్పొరేటర్‌ బన్నాల గీతతో కలిసి శంకుస్థాపన చేశారు. రాఘవేంద్ర నగర్‌ కాలనీ కల్వర్టుకి రిటైనింగ్‌ వాల్‌ కోసం రూ. 21 లక్ష పనులకు, మహిళా భవన్‌ రేపైర్స్‌ వర్క్స్‌ కోసం రూ. 9.60 లక్షలతో బాలాజీ ఎంక్లేవ్‌ లో సీసీ రోడ్డు కోసం రూ. 19 లక్షలు, కళ్యాణ్‌ పూరి నుంచి సీతారామ కాలనీ వరకు సీసీ రోడ్డు కోసం 80 లక్షల,బీరప్ప గడ్డ నుండి శ్రీనగర్‌ కాలనీ వరకు సీసీ రోడ్డు కోసం 37 లక్షలు 50 వేలు, చిల్కానగర్‌ పోచమ్మ టెంపుల్‌ రోడ్‌, నార్త్‌ కళ్యాణ్‌ పూరి, న్యూ రాంనగర్‌, మొదలగు రోడ్ల కొరకు 51 లక్ష రూపాయల పనులకు శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే బేతి సుభాష్‌ రెడ్డి, కార్పొరేటర్‌ బన్నాల గీతా ప్రవీణ్‌ మాట్లాడుతూ చిల్కానగర్‌ డివిజన్‌ అంటేనే అభివద్ధికి కేరాఫ్‌ అడ్రస్‌ అన్నారు. అదేవిధంగా నాణ్యత పాటించాలని ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్‌ డిప్యూటీ కమిషనర్‌ శ్రీనివాస్‌, అధికారులు ఈఈ నాగేందర్‌, డీఈ నిఖిల్‌ రెడ్డి, ఏఈ రాజ్‌ కుమార్‌ , బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు, డివిజన్‌ అధ్యక్షులు,ప్రధాన కార్యదర్శి వివిధ కాలనీల అధ్యక్షులు కార్యదర్శులు వారి వెల్ఫేర్‌ అసోసియేషన్‌ సభ్యులు డివిజన్‌ మహిళ నాయకురాళ్లు పాల్గొన్నారు.

Spread the love