యోగాతో జ్ఞాపకశక్తి పెరుగుతుంది: ఎమ్మెల్యే మంచిరెడ్డి

నవతెలంగాణ-తుర్కయాంజల్
యోగాతో జ్ఞాపకశక్తి పెరుగుతుందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. బుధవారం యోగాడే ను పురస్కరించుకొని అబ్దుల్లాపూర్ మెట్ మండలం ప్రైవేట్ స్కూల్స్ కరస్పాండెంట్ అసోసియేషన్, వి.ఎన్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగాడే ను నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎమ్మేల్యే హాజరై మాట్లాడుతూ యోగాతో ఆరోగ్యంగా ఉండగలమని తెలిపారు.విద్యార్థుల కు క్రమశిక్షణ అలవడుతుందన్నారు.దాదాపు 30 స్కూల్స్ నుండి 2000 మంది విద్యార్థులు పాల్గొని యోగ నిర్వహించారు.అంతర్జాతీయ యోగా ట్రైనర్ నర్సింగ్ గోయల్ యోగ సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతుబంధు అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, డీసీసీబీ వైస్ ఛైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య, మాజీ సర్పంచ్ కందాడ లక్ష్మారెడ్డి, కౌన్సిలర్ కళ్యాణ్ నాయక్, చక్రవర్తి గౌడ్, వశిష్ఠ మోడల్ స్కూల్ కరస్పాండెంట్ చెన్నమనేని మీనేందర్ రావు, గోపాల్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Spread the love