జియో 5 జి సేవలను ప్రారంభించిన ఎమ్మెల్యే మెచ్చా

– అశ్వారావుపేట లో ముగిసిన ఎమ్మెల్యే మెచ్చా పర్యటన…
– ముచ్చటగా మూడో రోజు సాగిన కార్యక్రమాలు…
– నేటి నుండి అన్నపురెడ్డిపల్లి లో….
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు నియోజక వర్గం వ్యాప్తంగా నిర్వహించనున్న మండలాల వారీ పర్యటనలు నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట లో బుధవారం తో ముగిసింది. మూడో రోజు నారంవారిగూడెం,గుర్రాల చెరువు,పేరాయిగూడెం,అల్లిగూడెం పంచాయితీల్లో ఆయన పర్యటించారు. రూ.82 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్ల ను ఆయనహొ ప్రారంభించారు. అశ్వారావుపేట లో ప్రప్రధమంగా జియో 5 జి సేవలను లాంచనంగా ప్రారంభించారు. రూ.1 కోటి 78 లక్షలతో నిర్మించనున్న తారు రోడ్డు పనులను పరిశీలించారు. ముందుగా నారంవారిగూడెం పంచాయితీ మొద్దులు గూడెం, నారంవారిగూడెం,నారంవారిగూడెం కాలని, పాత అల్లిగూడెం, పేరాయిగూడెం,గుర్రాల చెరువు గ్రామాల్లో పర్యటించారు.దిశ అశ్వారావుపేట నియోజకవర్గ విలేకరి దిలీప్ ఖన్నా పెద్ద కుమార్తె జయ కీర్తి 6వ పుట్టినరోజు వేడుకలో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు.అనంతరం అశ్వారావుపేట పట్టణంలో జియో 5 జి నీ లాంచ్ చేసారు. మొద్దులు గూడెం లో సీసీ రోడ్డు ప్రారంభించేందుకు వెళ్లిన ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ఇంకా ఆ గ్రామంలో సమస్యలు ఏమి మిగిలి ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా స్థానికులు విద్యుత్ స్థంబాలు అవసరం ఉందని,డ్రైనేజ్ లేకపోవడంతో వరద ఇండ్ల ల్లోకి వస్తుందని,అలాగే అంగన్వాడి కేంద్రం వద్ద గేట్ వాల్ ఏర్పాటు చేయాలని పెద్ద గుంత తీసి దానిని అల వదిలేశారని గతంలో ఆ గుంతలో పడి ఒక చిన్నారి మృతి చెందారని తెలుపడం తో వెంటనే స్పందించిన ఆయన విద్యుత్ శాఖ ఏడీఈ వెంకటేశ్వర్లు తోహొ మాట్లాడి స్థంబాలు ఏర్పాటు చేయాలని, అలాగే అక్కడే ఉన్న పంచాయతీ రాజ్ శాఖ ఏఈ శ్రీధర్ కు డ్రైనేజ్ ఏర్పాటుకు అంచనా వేసీ అందించాలని మరియు అంగన్వాడి కేంద్రం వద్ద తీసిన గుంత ను వెంటనే పూడ్చాలని సంబంధిత శాఖ అధికారికి ఆదేశించారు. నారంవారిగూడె లో సీసీ రోడ్డు ప్రారంభానికి వెళ్ళిన ఆయన అక్కడ సమస్యలు అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్బంగా ప్రజలు అడిగిన వెంటనే సీసీ రోడ్డు మంజూరు చేయడంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు అలాగే డ్రైనేజ్ కూడా ఏర్పాటు చేయాలని కోరారు.త్వరలో అది కూడా ఏర్పాటు చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు.నారంవారిగూడెం నుండి గుర్రాల చెరువుహొ 2.5 కి.మీ దూరం రహదారి రూ.1 కోటి 78 లక్షల వ్యయంతో తారు రోడ్డు నిర్మిస్తుండగా ఆహొ పనులను పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నారంవారిగూడెం కాలనీలో సీసీ రోడ్డు ప్రారంభించడానికి వెళ్లిన ఎమ్మెల్యే గారు సమస్యలు అడిగి తెలుసుకున్నారు.ప్రస్తుతం వారు ఉంటున్నా ఇండ్లకు పట్టాలు ఇవ్వాలని కోరారు త్వరలో పట్టాలు ఏర్పాటు చేస్తానని తెలిపారు. పాత అల్లిగూడెం లో సీసీ రోడ్లు ప్రారంభించడానికి వెళ్లిన ఎమ్మెల్యే సమస్యలు అడిగి తెలుసుకున్నారు.సీసీ రోడ్డు మంజూరు చేసిన ఆయనకుహొ ధన్యవాదాలు తెలిపారు గ్రామస్థులు.అలాగే కరెంట్ స్థంబాలు ఏర్పాటు చేయాలని, లో ఓల్టేజ్ సమస్య ఉందని తెలుపడం తో వెంటనే విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. పేరాయిగూడెం లో ఎమ్మెల్యే మెచ్చా కు కృతజ్ఞతలు తెలుపుతూ శాలువాతోహొ సర్పంచ్ సుమతి, మహిళలు సత్కరించారు.మిగిలిన వీధుల్లో కూడా రోడ్డు మంజూరు చేయాలని కోరారు.దానికి తప్పకుండా ఏర్పాటు చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. గుర్రాల చెరువు లో సీసీ రోడ్డు ప్రారంభానికి వెళ్ళిన సందర్భంలో అదే గ్రామంలో పలు సీసీ రోడ్లు కావాలని కోరారు అలాగే అదే గ్రామంలో ఒక వృద్ధుని కి పెన్షన్ రావట్లేదని తెలుపడం తో వెంటనే స్పందించి అధికారితో మాట్లాడి ఏర్పాటు చేయమని ఆదేశించారు.(సీసీ రోడ్డు ఏర్పాటు చేస్తా అని ఎమ్మెల్యే వారికి తెలుపడం తో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ వరలక్ష్మి,ఎంపీపీ శ్రీరామ మూర్తి , వైస్ ఎంపీపీ ఫణీంద్ర,సర్పంచ్ లు మను గొండ వెంకట ముత్యం,కలపాల దుర్గయ్య,క్రిష్ణ వేణి,ఉప సర్పంచ్ లు,మండల నాయకులు జేకేవీ రమణారావు,రాజమోహన్ రెడ్డి,సంపూర్ణ,నార్లపాటి రాములు,నాయకులు, కార్యకర్తలు, అభిమానులు,అధికారులు పాల్గొన్నారు.

Spread the love