– ఆసక్తి చూపని రైతు బంధువులు
– హాజరైన అత్యధికులు రైతేతరులే
– సమీకరణ పై ఎమ్మెల్యే గుస్సా
నవతెలంగాణ – అశ్వారావుపేట
తెలంగాణ రాష్ట్ర అవతరణ శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని తలపెట్టిన ప్రభుత్వం 22 రోజులు పాటు సంబురాలు నిర్వహించడానికి కార్యాచరణ చేపట్టింది.దీనిలో రైతు దినోత్సవం ఒక దాన్ని ఘనంగా నిర్వహించి, రైతులను సమీకరించి విస్త్రుత ప్రచారం చేయాలని ప్రభుత్వం యోచించింది. అందుకు అనుగుణంగానే అధికారులు ఏర్పాట్లు చేసారు. ఒక్కో రైతు వేదిక లో వేయి మందికి సరిపడేలా వసతులు కల్పించారు. భోజనాలు సిద్దం చేసారు. కానీ ఈ సంబరాల్లో పాల్గొన్నది అత్యధికులు రైతేతరులే కావడం,రైతు బంధువులు ఎందరో వేదికలు వైపు కన్నెత్తి చూడలేదు. అశ్వారావుపేట మండలంలో 10 వేలు పైనే రైతు బంధు లబ్ధిదారులు ఉన్నారు.మండల వ్యాప్తంగా నాలుగు వేదికలు వద్ద వేయి మంది చొప్పున ఏర్పాట్లు చేసారు.భోజనాలు సిద్దం చేసారు.కానీ ఈ కార్యక్రమానికి హాజరు అయింది మాత్రం ప్రజా ప్రతినిధులు,వారి అనుచరులు,క్రియా శీల నాయకులు మాత్రమే.మిగతా జనం అంతా సాధారణ పౌరులే కావడం విశేషం.మండల వ్యాప్తంగా 10 వేలు పై చిలుకు రైతు బంధు లబ్ధిదారులు ఉన్నారు. నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట మండలంలో,పేరాయిగూడెం పంచాయితీ రైతు వేదిక పరిధిలో 3384 మంది రైతు బంధు లబ్ధిదారులు ఉన్నారు.ఈ రైతు వేదిక పరిధిలోని రైతు దినోత్సవానికి స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణం వేదిక ఏర్పాటు చేసి,వేయి మందికి వసతులు కల్పించారు. స్థానిక ప్రాధమిక వ్యవసాయ పరపతి సంఘం పాలక వర్గం ఆద్వర్యంలో,వ్యవసాయ శాఖ పర్యవేక్షణలో ఈ సంబురాలు నిర్వహించారు. పరపతి సంఘం కార్యాలయం నుండి వేదిక వరకు ఎడ్ల బండ్లు,ట్రాక్టర్ లతో ర్యాలీ నిర్వహించారు. దీనికి ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావును ఆహ్వానించారు.కానీ కనీసం రెండు మూడు వందలు మంది కూడా రైతులు పాల్గొన లేదు.దీంతో ఆయన ర్యాలీ లో పాల్గొని సభావేదిక వద్దకు రాకుండానే ఇతర మండలాల్లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొనడానికి వెళ్ళిపోయారు.మిగతా తిరుమలకుంట, నారాయణపురం, అనంతారం వేదికలు వద్దా ఇదే పరిస్థితి కనిపించింది. ఈ దినోత్సవానికి సాదారణ ప్రజలు హాజరై విజయవంతం చేసారని,రైతు బంధు డబ్బులు కోసం మాత్రం ఆలస్యం అయితే చాలు ఫోన్ లు మీద ఫోన్ లు చేస్తారని అధికారులు వాపోయారు. ఈ కార్యక్రమాల్లో ఎం.పి.పి శ్రీరామమూర్తి,వైస్.ఎం.పి.పి ఫణీంద్ర,జెడ్.పి.టి.సి వరలక్ష్మి,పి.ఎ.సి.ఎస్ అధ్యక్షులు సత్యనారాయణ,పుల్లారావు,సర్పంచ్ లు రమ్య,సుమతి,క్రిష్ణ వేణి,జ్యోత్స్న బాయి,సున్నం సరస్వతి,రమేష్,రాజశేఖర్,ఊరికే వీరాస్వామి,ఎ.డి అఫ్జల్ బేగం,ఆయిల్ఫెడ్ డి.ఒ బాలక్రిష్ణ,ఎ.ఒ నవీన్,పిఎసిఎస్ ఈఓ విజయ్ బాబు, రైతు నాయకులు కాసాని వెంకటేశ్వరరావు, ఆలపాటి రాంమోహన్ రావు, జేకేవీ రమణారావు, కాసాని చంద్రమోహన్, పాల్గొన్నరు.