విద్యుత్ విజయోత్సవం లో మాట్లాడుతున్న ఎమ్మెల్యే మెచ్చా

– చీకట్లు నుండి వెలుగుల్లో తెలంగాణ – మెచ్చా నాగేశ్వరరావు
– దిగ్విజయంగా ముగిసిన విద్యుత్ విజయోత్సవం
నవతెలంగాణ – అశ్వారావుపేట
చీకట్లను పారద్రోలి తెలంగాణలో వెలుగులు నింపడం ప్రత్యేక తెలంగాణ సాధించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దేనని స్థానిక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో బాగంగా సోమవారం నియోజక కేంద్రం అయిన అశ్వారావుపేట లోని గిరిజన భవన్ లో ఎన్.పి.డి.సి.ఎల్ ఎ.డి.ఇ బసవ వెంకటేశ్వర్లు అద్యక్షతన నిర్వహించిన విద్యుత్ విద్యుత్ విజయోత్సవం లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.విద్యుత్ లేకపోతే ఏ సమాజం అభివృద్ధి సాధించలేదని,తెలంగాణ రాష్ట్రం రాకముందు ఎప్పుడూ కరెంట్ ఉండేదో ఎప్పుడు పోయేదో తెలిసేది కాదని గుర్తు చేసారు.రైతులకు విద్యుత్ సౌకర్యం లేక అనేక ఇబ్బందులు పడ్డ మాట వాస్తవమని, తెలంగాణ ప్రజల కష్టాలు తీర్చాలనే సంకల్పంతో 14 ఎండ్లు పోరాడి ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి విముక్తిని కల్పించారని.సాధించుకున్న తెలంగాణలో నేడు అధ్బుతంగా తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలనలో దేశానికే మన రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని హర్షం వెలిబుచ్చారు.రైతులకు రోజంతా ఉచిత విద్యుత్ కల్పించిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని తెలిపారు.ఏండ్లు తరబడి పరిపాలించిన పార్టీలు ఈ రోజు మాకు ఓటు వెయ్యండి మేం చేసి చూపిస్తాం అంటున్నారు…ఎం చేస్తారో తెలియదు కానీ రాష్ట్రాన్ని మాత్రం నాశనం చేయడానికే కంకణం కట్టుకున్నారు అని కాంగ్రెస్,బీజేపీ పార్టీల ప్రస్తావించారు.ఆ నాడు రైతులకు ఉచిత విద్యుత్ ఎందుకు కల్పించ లేదో, రైతు బంధు ఎందుకు అమలు చేయలేదని,రైతు భీమా ఎందుకు ఇవ్వలేదు సమాధానం చెప్పాలన్నారు.మన అశ్వారావుపేట నియోజకవర్గంలోని వేదాంత పురం పంచాయతీ లోని తిమ్మాపురం,ఊట్లపల్లి పంచాయతీ లోని గంగారం గ్రామాల్లో 30 ఏండ్లుగా విద్యుత్ సౌకర్యం లేదని,ఆ గ్రామాలకు తెలంగాణ వచ్చాకే విద్యుత్ సౌకర్యం వచ్చిందని ఇలా చెప్పుకుంటూ పోతే మరెన్నో ఉన్నాయని ఉదహరించారు.నిరంతరం మనకు వెలుగులు నింపేందుకు అహర్నిశలు కష్టపడుతున్న విద్యుత్ శాఖ కార్మికులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయోత్సవం లో వేదికనలంకరించిన వారిలో అశ్వారావుపేట ఎం.పి.పి శ్రీరామ మూర్తి,అశ్వారావుపేట, దమ్మపేట జెడ్.పి.టి.సి లు వరలక్ష్మి, పైడి వెంకటేశ్వరరావు,పేరాయిగూడెం,అల్లిగూడెం సర్పంచ్ లు సుమతి,క్రిష్ణ వేణి లు ఉన్నారు. ఈ కార్యక్రమంలో అయిదు మండలాల జెడ్పీటీసీ,ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, మండల నాయకులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు, రైతులు, అధికారులు పాల్గొన్నారు.

Spread the love