– పల్లె ప్రగతిలో పంచాయతీ కార్యదర్శులు పాత్ర కీలకం
నవతెలంగాణ-లింగాలఘనపురం
మహిళల సమగ్ర ఆరోగ్య పరిరక్షణే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం, పల్లె ప్రగతి లో గ్రామ పంచాయతీ కార్యదర్శుల పాత్ర కీలకమైనందని ఎమ్మెల్యే డాక్టర్ టి రాజయ్య అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ చిట్ల జయశ్రీఉపేందర్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన మండలానికి సంబంధించిన జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు గ్రేడ్-4 పంచాయతీ కార్యదర్శులుగా నియామక ఉత్తర్వులు పంపిణీ కార్యక్రమంలో తెలంగాణ తొలిమాజీ ఉపముఖ్యమంత్రివర్యులు , ఎమ్మెల్యే డాక్టర్.తాటికొండ రాజయ్య ముఖ్య అతిథిగా పాల్గొని జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు గ్రేడ్-4 పంచాయతీ కార్యదర్శులుగా నియామక పత్రాలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా.రాజయ్య మాట్లాడుతూ…తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత గాంధీజీ కన్న కలల స్వరాజ్యాన్ని సాధించడం కోసం గ్రామస్వరాజ్యం ద్వారానే రామరాజ్యాన్ని సాధించాలనే ఉద్దేశంతోటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో ఉండబడినటువంటి ప్రతి గ్రామపంచాయతీకి ఒక పంచాయతీ కార్యదర్శి పాలనధికారిగా ఉండాలని చెప్పి గ్రామంలో ఉండబడిన సమస్యలు ప్రభుత్వపరంగా సత్వరమే పరిష్కారం చేయడం కోసం ప్రతి గ్రామ పంచాయతీకి ఒక పంచాయతీ కార్యదర్శి ఉండాలని చెప్పి ఒకేసారి 9000 పైచీలుకు మందిని జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా ఒప్పంద ప్రాతిపదికన నియమించుకోవడం జరిగినది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాటకు కట్టుబడి వారందరినీ క్రమబద్ధీకరించాలనే ఉద్దేశంతోటి వారికి పేస్కేల్ ఇస్తూ ఈరోజు నియామక ఉత్తర్వులు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ నమ్మకం తోటి అయితే మీకు ఇచ్చిన మాటకు కట్టుబడి మిమ్మల్ని అందరిని పర్మినెంట్ ఉద్యోగులుగా నియమిస్తూ మీ మీద గురతర బాధ్యతను ఉంచడం జరుగుతుంది. సీఎం కేసీఆర్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీరందరూ అంకితభావంతో పనిచేస్తూ గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించాలని నియామక పత్రాలు పొందిన జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సూచించారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మహిళల సమగ్ర ఆరోగ్య పరిరక్షణ ధ్యేయం గా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో శ్రీకారం చుట్టిన ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని తెలంగాణ తొలిమాజీ ఉపముఖ్యమంత్రి , ఎమ్మెల్యే డాక్టర్.తాటికొండ రాజయ్య లాంఛనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…మహిళల సమగ్ర ఆరోగ్య పరిరక్షనే ధ్యేయంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యం మహిళా కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని తెలిపారు.రాష్ట్రంలో ప్రతి మహిళ ఆరోగ్యంతో ఉండాలనే లక్ష్యంతో ఆరోగ్య తెలంగాణలో భాగంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కానుకగా ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించడం జరిగిందని తెలిపారు.ఆరోగ్య మహిళా కార్యక్రమంలో భాగంగా మహిళలు ప్రధానంగా ఎదుర్కొనే 8 రకాల ఆరోగ్య సమస్యలులి ముందుగానే గుర్తించి , చికిత్స అందించడం జరుగుతుందని తెలిపారు.ఆరోగ్య మహిళా కార్యక్రమంలో భాగంగా మధుమేహం , ఎనీమియా , క్యాన్సర్ నిర్ధారణ , పౌష్టికార లోపాన్ని గుర్తించడం , రక్తపోటు , ఇతర సాధారణ పరీక్షలతో పాటు ఓరల్ , సర్వేకల్ , థైరాయిడ్ పరీక్ష , సూక్ష్మ లోపాలను గుర్తించడం , అయోడిన్ సమస్య , పోలిక్ యాసిడ్ , ఐరన్ లోపంతో పాటు , విటమిన్ బి12 , విటమిన్ డి వంటి 57 రకాల టెస్టులులి ను చేసి వారికి వైద్య సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసిల ఫోరం మండల అధ్యక్షుడు గండి మంగమ్మ యాదగిరి, ఎంపిటిసి రాజిరెడ్డి, ఎంపిడిఓ సురేందర్, ఎంపిఓ మల్లికార్జున్, డాక్టర్ కరుణాకర్ రాజు ,మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్, జిల్లా దిశ కమిటీ సభ్యురాలు భాగ్యలక్ష్మి, యూత్ మండల అధ్యక్షుడు శ్రీవారి, రజక సంఘం మండల అధ్యక్షుడు రాజు , నాయకులు వీరయ్య కె యాదగిరి, హరికష్ణ, రవి పూర్ణచందర్, వైద్య సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులు ముఖ్య నాయకులు మహిళలు వైద్య సిబ్బంది పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.