– కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు ముక్కీస రత్నాకర్ రెడ్డి అగ్రహం
– అబద్ధపు వాఖ్యలను నిరసిస్తూ ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దహనం
నవతెలంగాణ-బెజ్జంకి
మానకొండూర్ నియోజకవర్గంలో కొనసాగని గురుకుల పాఠశాలలను కొనసాగుతున్నాయంటూ, ఇల్లంతకుంట మండలం సోమారంపేట గ్రామ సర్పంచ్ ఆనంద రెడ్డికి ఎల్ఓసీ అందించామని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అసెంబ్లీ సాక్షిగా అబద్ధపు వాఖ్యలు చేయడం సిగ్గుచేటని కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు ముక్కీస రత్నాకర్ రెడ్డి అగ్రహం వ్యక్తం చేశారు. అదివారం మండల కేంద్రంలోని రైతు ఎండ్లబండి చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ గురుకుల పాఠశాలలపై చేసిన అబద్ధపు వాఖ్యలను నిరసిస్తూ అయన దిష్టిబొమ్మను దహనం చేశారుఈ కార్యక్రమానికి తెలంగాణ యూత్ కాంగ్రెస్ రీసేర్చ్ విభాగం చైర్మన్,జిల్లాధికార ప్రతినిధి పొతిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గత తొమ్మిదేళ్లుగా నియోజకవర్గ ప్రజలను మభ్యపెడుతూనే ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కాలం వెళ్లదీస్తున్నారన్నారు. మానకొండూర్ నియోజకవర్గంలోని అయా మండలాల్లోని గురుకుల పాఠశాలలు వసతుల్లేక ఇతర నియోజకవర్గాలకు తరలిపోయాయని అసహనం వ్యక్తం చేశారు.గ్రామాభివృద్ధి కోసం చేసిన అప్పులు భరించలేక సోమారంపేట సర్పంచ్ ఆనంద రెడ్డి అత్మహత్య చేసుకుని మృతి చెందితే ఎల్ఓసీ అందజేసానని చట్టసభలో ఎమ్మెల్యే రసమయి అబద్ధపు వాఖ్యలు చేయడం..ఎమ్మెల్యే ఎల్ఓసీ అందజేయలేదని మృతుని కూమారుడు సోషల్ మీడియా వేదికగా అవేదన వ్యక్తం చేయడం ఎమ్మెల్యే వ్యక్తిత్వానికి నిదర్శనమన్నారు. ఇప్పటికైనా మృతి చెందిన సర్పంచ్ కుటుంబానికి ఎమ్మెల్యే,బీఆర్ఎస్ నాయకులు అండగా నిలిచి చిత్తశుద్ధిని చాటుకోవాలని సూచించారు.నాయకులు శానగొండ శ్రావణ్ కుమార్,రోడ్డ మల్లేశం,ముక్కెర కొమురయ్య,బండిపల్లి రాజు,కొంకటి రాములు,దోనె వెంకటేశ్వర్ రావు, చిలివేరు రాజిరెడ్డి,రెడ్డి రామకృష్ణ రెడ్డి, శీలం నర్సయ్య,జెట్టి అనిల్ తదితరులు పాల్గొన్నారు.