నవతెలంగాణ – బెజ్జంకి: మానకొండూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ గురువారం ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో బీఆర్ఎస్ జిల్లాధ్యక్షుడు,సుడా చైర్మన్ జీవి రావుతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. మానకొండూర్ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో మళ్లీ మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై వారి ముందుకు వస్తానని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ధీమా వ్యక్తం చేశారు. అంతకుముందు ఎంపీపీ లింగాల నిర్మల,జెడ్పీటీసీ కడగండ్ల కవిత,ఏఎంసీ చైర్మన్ కచ్చు చంద్రకళ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ను మర్యాదపూర్వకంగా కలిసి ఆత్మస్థైర్యాన్ని అందించారు.