మరో ఎమ్మెల్యేకు రోడ్డు ప్ర‌మాదం..ఆస్పత్రికి తరలింపు

నవతెలంగాణ – అదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుకు తృటిలో త‌ప్పిన పేను ప్ర‌మాదం. నిర్మ‌ల్ బైపాస్‌లో ఎమ్మెల్యే ప్ర‌యాణిస్తున్న కారు అదుపుత‌ప్పి ఆవును ఢీకొట్టింది. దీంతో ఎమ్మెల్యే కారు ముందు భాగం పూర్తిగా దెబ్బ‌తిన్న‌ది. ఎమ్మెల్యే బాపురావు చేతి వేళ్ల‌కు తీవ్ర గాయ‌మైంది. ర‌క్త‌స్రావం కావ‌డంతో.. ఎమ్మెల్యేను హుటాహుటిన చికిత్స నిమిత్తం మ‌రో వాహ‌నంలో ఆదిలాబాద్ అస్ప్రతికి త‌ర‌లించారు.
ప్ర‌స్తుతం ఎమ్మెల్యే బాపురావు ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉంద‌ని, ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని వైద్యులు తెలిపారు.

Spread the love