కళ్యాణ లక్ష్మితో అమ్మల కళ్ళల్లో సంతోషం ఎమ్మెల్యే సీతక్క

నవతెలంగాణ – గోవిందరావుపేట
కళ్యాణ లక్ష్మితో ఆడపిల్లల పెళ్లిళ్లు చేసిన అమ్మల కళ్ళల్లో సంతోషం కనిపిస్తుందని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. గురువారం మండల కేంద్రంలో తహసిల్దార్ అల్లం రాజకుమార్ ఆధ్వర్యంలో కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే సీతక్క హాజరై మాట్లాడారు. కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా వచ్చిన సొమ్మును అమ్మను తల్లులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా 59 మంది లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ జరిగినట్లు తహసిల్దార్ రాజకుమార్ తెలిపారు.ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా వైస్ జడ్పీ చైర్మన్ బడే నాగజ్యోతి , ములుగు జిల్లా గ్రంథాలయ చైర్మన్ పోరిక గోవింద్ నాయక్, ఎంపీపీ సూడి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీటీసీలు గోపిదాసు ఏడుకొండలు, గుండెబోయిన నాగలక్ష్మి- అనిల్ యాదవ్, చాపల ఉమాదేవి- నరేందర్ రెడ్డి, ఎలిశాల స్వరూప, తహశీల్దార్ కార్యాలయ సిబ్బంది, వివిధ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

 

Spread the love