మండల అభివద్ధికి వందల కోట్ల రూపాయల నిధులు ఎమ్మెల్యే టి ప్రకాష్‌ గౌడ్‌

– రషీద్‌ గూడలో 1.27 కోట్ల అభివద్ధి పనులు ప్రారంభం
నవతెలంగాణ-శంషాబాద్‌
మండలంలో వందల కోట్ల రూపాయలతో అభివద్ధి పనులు చేపడుతున్నట్టు రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే టీ. ప్రకాష్‌గౌడ్‌ అన్నారు. మంగళవారం శంషాబాద్‌ మండల పరిధిలోని రషీద్‌గూడ గ్రామంలో కోటి 27 లక్షలతో చేపట్టిన అభివద్ధి పనులను సర్పంచ్‌ మంచాల రాణి రవితో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. అంతర్గత మురుగు కాలువలు, సీసీ రోడ్ల నిర్మాణానికి రూ. 8 లక్షలు, గ్రామపంచాయతీ నూతన భవన నిర్మాణానికి రూ. 20 లక్షలు , ఎయిర్‌ పోర్టు ప్రహరీ గోడ మూలమలుపు నుంచి గ్రామం మీదుగా పోశెట్టి గూడ- రషీద్‌ గూడ చౌరస్తా వరకూ రూ. 87 లక్షలతో బీటీ రోడ్డు నిర్మాణం, పోశెట్టి గూడ గ్రామంలో రూ. 6 లక్షలతో అంతర్గత మురుగు కాలువల నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రశీద్‌ గూడ గ్రామపంచాయతీ అభివద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తానని తెలిపారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో రాష్ట్రం శరవేగంగా అభివద్ధి చెందుతూ ఇతర రాష్ట్రాలకు రోల్‌ మోడల్‌గా ఉందని అన్నారు. సంక్షేమ అభివద్ధి పథకాలను ప్రజలకు అందించడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతుందన్నారు. ఆసరా పింఛన్లు, మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ, రైతుబంధు, రైతు బీమా, పాఠశాలల అభివద్ధి, సీసీ రోడ్లు, అంతర్గత మురుగు కాలువలు, హరితహారం, పల్లె ప్రగతి , శ్మశాన వాటికలు , డంపింగ్‌ యార్డులు, క్రీడా ప్రాంగణాలు వంటి పలు అభివద్ధి కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. అభివద్ధితో పాటు మరిన్ని పథకాలు ప్రజలకు అందాలంటే వచ్చే ఎన్నికల్లో కూడా బీఆర్‌ఎస్‌ పార్టీని ప్రజలు ఆదరించి అధికారంలోకి తీసుకురావాలని కోరారు. గ్రామ సర్పంచ్‌ మంచాల రాణి రవి, చిన్న గోల్కొండ పిఎసిఎస్‌ చైర్మన్‌ బొమ్మ దవణాకర్‌ గౌడ్‌ మాట్లాడుతూ గ్రామ అభివద్ధికి కోటి 27 లక్షల నిధులు కేటాయించిన ఎమ్మెల్యేకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గత నుంచి కూడా ఎమ్మెల్యే గ్రామం పై ప్రత్యేక అభిమానంతో నిధులు కేటాయించి అభివద్ధి చేస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ దిద్యాల జయమ్మ శ్రీనివాస్‌, జడ్పీటీసీ నీరటి తన్విరాజు ముదిరాజ్‌, ఉప సర్పంచ్‌ నవారు జగన్మోహన్‌ రెడ్డి, గ్రామ వార్డు సభ్యులు షరీఫా బేగం, జాంగిర్‌ బి, మల్లారెడ్డి, జగన్‌, ప్రభాకర్‌, పిఎసిఎస్‌ చైర్మన్‌ బొమ్మ దవణాకర్‌ గౌడ్‌, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షులు కె.చంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శి మోహన్‌ రావు, దేవరంపల్లి శ్రీనివాస్‌, ధన్‌ పాల్‌ రెడ్డి, మంచాల సుధాకర్‌ గౌడ్‌ , లక్ష్మారెడ్డి , బుచ్చిరెడ్డి , ముత్యం రెడ్డి, ముత్తార్‌ , గడ్డం అశోక్‌, సుభాన్‌, బాలరాజ్‌ సాయిలు, అంజయ్య , అధికారులు వసంత లక్ష్మి ,ఉషా కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love