నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
హనుమకొండ జిల్లాలోని వేలేరు మండలంలోని కన్నారం ఎర్రబెల్లి గ్రామాలను భీమదేవరపల్లి, అక్కన్నపేట మండలలో కలుపుతూ బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ఎర్రబెల్లి గ్రామాన్ని భీమదేవరపల్లి మండలానికి, కన్నారం గ్రామాన్ని సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలానికి బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం పై హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.