రుణమాఫీతో రైతుల ముఖాల్లో ఆనందం: ఎమ్మెల్యే వంశీకృష్ణ

Farmers' faces happy with loan waiver: MLA Vamsikrishnaనవతెలంగాణ – ఉప్పునుంతల
దేశ చరిత్రలో ఇదొక స్వర్ణ యుగం అది కేవలం కాంగ్రెస్తోనే సాధ్యమని అందుకు ప్రత్యక్ష సాక్ష్యం రేవంత్ రెడ్డి హయాంలో రెండు లక్షల రుణమాఫీ శుభ తరుణంలో రైతుల ముఖాల్లో వెల్లువెరిసిన ఆనందమే అందుకు ప్రత్యక్ష సాక్ష్యం అని అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. రుణమాఫీ సంబరాల్లో భాగంగా ఆయన ఉప్పునుంతల మండలంలో గురువారం రోడ్ షో నిర్వహించి మాట్లాడారు. 2006 సంవత్సరంలో డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏకకాలంలో రుణమాఫీ చేసిన మహనీయుడని అనంతరం మళ్లీ అదే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందని ఆయన అన్నారు. టిఆర్ఎస్, బిజెపి ఒకటే నాలుక విధానాన్ని అవలంబిస్తున్నాయని కానీ మాకు పార్టీలు కులాలు అనే తారతమ్యాలు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేస్తున్నామన్నారు. 2018 నుండి 2023 వరకు అవకాశం ఉండి కూడా మాఫీ కానీ రైతులు ఉంటే మాకు సమాచారం అందిస్తే వారికి రుణమాఫీ అయ్యేవిధంగా పూర్తి బాధ్యత నాదేనని ఆయన హామీ ఇచ్చారు. సోనియమ్మ మాట ఇచ్చి రాష్ట్రాన్ని ఇచ్చింది రాహుల్ గాంధీ మాట ఇచ్చి రైతు రుణమాఫీ ఇచ్చారని అప్పుడు ఇప్పుడు సోనియమ్మ రాజ్యంలోనే రైతులు ఆనందపడ్డారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 615 మండలాల్లో లక్ష ఆరువేల మంది రైతులతో సీఎం ముఖాముఖి మాట్లాడనున్నారని ఆయన అన్నారు. రైతులు కాంగ్రెస్ శ్రేణులు అంతకుముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి బైకులతో ర్యాలీ నిర్వహించి స్థానిక రైతు వేదిక భవనంలో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కట్ట అనంతరెడ్డి, మాజీ జెడ్పిటిసి అనంత ప్రతాపరెడ్డి, సీనియర్ నాయకులు తిప్పర్తి నరసింహారెడ్డి, ఆయా గ్రామాల మాజీ ఎంపిటిసిలు, మాజీ సర్పంచులు, కాంగ్రెస్ కార్యకర్తలు, వ్యవసాయ శాఖ అధికారులు, బ్యాంకర్లు తదితరులు పాల్గొన్నారు.
Spread the love