నవతెలంగాణ – కమ్మర్ పల్లి
మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సోమవారం బాల్కొండ నియోజకవర్గంలోని పలు మండలాల్లో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు మోర్తాడ్ మండలం దోన్ పాల్ గ్రామంలో వన మహోత్సవం కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పాల్గొంటారు. మధ్యాహ్నం 11.30 గంటలకు భీంగల్ మండల కేంద్రంలోని బంజారా భవన్ లో భీంగల్ మండల లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ చెక్ ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీఆర్ఎస్ నాయకులు కోరారు.