కస్తూర్బా బాలికల విద్యాలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే

నవతెలంగాణ – తిరుమలగిరి
జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకొని తిరుమలగిరి మండల కేంద్రంలోని కస్తూర్బా బాలికల విద్యాలయాన్ని బుధవారం తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు సందర్శించారు. ఈ సందర్భంగా బాలికలకు  జాతీయ బాలికల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా  పాఠశాలలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకుని వీలైనంత త్వరలో సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో పదవ తరగతి  విద్యార్థినిలు బాగా చదువుకోవాలని, మంచి మార్కులు సాధించాలని అన్నారు. విద్యార్థినులకు సంరక్షణగా ఉంటూ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మంచిగా చదివించాలని ప్రత్యేక అధికారిని సుస్మితకు  తెలియజేశారు. విద్యార్థినులు  ఎమ్మెల్యే మందుల సామేలు ను  శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి దూపటి అంజలి, వైస్ ఎంపీపీ సుజాత, మండల విద్యాధికారి శాంతయ్య, నాయకులు ఎల్సోజు నరేష్, సుంకరి జనార్ధన్, మూల అశోక్ రెడ్డి, జిమ్మిలాల్, పేరాల వీరేష్, బత్తుల శ్రీను,  మరియు పాఠశాల ఎస్ఓ సుస్మిత, ఉపాధ్యాయునిలు కవిత, సునీత, వాణిశ్రీ, కళావతి, యశోద, శిరీష, సంతోష తదితరులు పాల్గొన్నారు.
Spread the love