తెలంగాణ అసెంబ్లీ హాల్లో జరిగిన పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ మీటింగ్ లో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పాల్గొన్నారు. మంత్రి శ్రీధర్ బాబు, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, కమిటీ చైర్మన్ షాద్ నగర్ శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. కమిటీ సభ్యునిగా మొదటిసారి ఈ సమావేశానికి హాజరైన సందర్బంగా ఎమ్మెల్యే శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సమావేశంలో ఇతర ఎమ్మెల్యేలు, కమిటీ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.