నవతెలంగాణ – ఆర్మూర్
ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేష్ ను హైదరబాద్ లో మంగళవారం మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నారా లోకేష్ ను శాలువా తో సన్మానించారు . ఈ సందర్భంగాఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రాలు వేరు అయినా అందరం అన్నతమ్ముల వలె ఉన్నాం ఆని చంద్రబాబు అంటే ఐటీ రంగం గుర్తుకు వస్తుంది అని, విజన్ గల నాయకుడు అని, కేద్రంలో బీజేపీ ప్రభుత్వంతో టీడీపీ పొత్తు ఉండటం మరింత అభివృద్ధికి తోడ్పాటు జరుగుతుంది అని అన్నారు. తిరుమలకు వచ్చే తెలంగాణ వారికి ఎమ్మెల్యేల సిఫార్సుల లేఖలు చెల్లె విధంగా చూడాలని ఎమ్మెల్యే కోరారు.