బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన ఎమ్మెల్యే

నవతెలంగాణ – డిచ్ పల్లి
రోడ్డు ప్రమాదంలో మరణించిన యువకుడి కుటుంబానికి ఆర్ధిక సహాయం డిచ్ పల్లి మండలంలోని దేవనగర్ క్యాంప్ గ్రామానికి చెందిన యువకుడు ఎస్. అభిషేక్ రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలుసుకొని బుధవారం ఇంటి వద్దకు వెళ్లి కుటుంబ సభ్యులకు పరామర్శించి, ఆర్థిక సహాయాన్ని ఆర్టీసీ చైర్మన్ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అందజేశారు. జరిగిన సంఘటన పట్ల విచారం వ్యక్తం చేసి ప్రభూత్వం నుండి సాధ్యమైనంత వరకు ఎక్స్ గ్రేషియా ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. అయన వెంట సర్పంచ్ ఖాతిజా యూసఫ్, ఐడిసిఎంఎస్ చైర్మన్ సాంబార్ మోహన్, జడ్పిటిసి దాసరి ఇందిరా లక్ష్మీ నర్సయ్య, మండల అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డితో పాటు నాయకులు, కార్యకర్తలు, బందువులు, తదితరులు ఉన్నారు.

Spread the love