– మద్దతు ధర కంటే 100 రూపాయలు పెరిగిన పత్తి ధర,
– రైతులకు ఎలాంటి మోసాలు జరగకూడదు వ్యాపారులు అధికారులు సహకరించాలి ఎమ్మెల్యే,
నవతెలంగాణ- మద్నూర్
ఇటు తెలంగాణ అటు మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాలకు పూర్తిగా సరిహద్దులు గల మద్నూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పత్తి కొనుగోళ్లలో తెలంగాణ రాష్ట్రంలో గుర్తింపు గల మార్కెట్ ఈ మార్కెట్ పరిధిలో బుధవారం నాడు పత్తి కొనుగోళ్ల బిట్లను జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మి కాంతారావు ప్రారంభించారు. కొనుగోళ్ల బీట్లు ప్రారంభంతో పత్తికి మద్దతు ధర కంటే 100 రూపాయలు అధికంగా పలికింది. మద్దతు ధర పత్తి క్వింటాలుకు 7020 రూపాయలు ఉండగా పత్తి కొనుగోల్ల వీటిలో పత్తి ధర క్వింటాలుకు 7120 రూపాయలు పలికింది క్వింటాలుకు వంద రూపాయలు ధర పెరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పత్తి పంట రైతుల ఉద్దేశించి మాట్లాడుతూ రైతులకు పత్తి అమ్మకాల్లో ఎలాంటి మోసాలు జరగకూడదని పత్తి కొనుగోలు వ్యాపారులు సక్రమంగా కొనుగోలు జరుపుతూ సహకరించాలని అధికారులు కూడా పత్తి కొనుగోళ్లపై ప్రత్యేక దృష్టి సాదిస్తూ సహకరించాలని సూచించారు. పత్తి కొనుగోళ్ల బిట్ల ప్రారంభోత్సవంలో ఇటీవల మద్నూర్ మార్కెట్ కమిటీకి పత్రిక పరంగా రాజీనామా చేసిన చైర్మన్ సంగమేశ్వర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం సభ్యులు మార్కెట్ కమిటీ సెక్రటరీ విట్టల్ మార్కెట్ కమిటీ సూపర్వైజర్ సత్యం కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మద్దతు ధర కొనుగోలు అధికారి రెడ్డి అధికార పార్టీ నాయకులు మాజీ జెడ్పిటిసి సభ్యులు జి సాహెబ్ రావు జుక్కల్ జెడ్పిటిసి కుటుంబ సభ్యులు దాదారావు పటేల్ షక్కర్గ రామ్ పటేల్ హనుమాన్ స్వామి పప్పు సెట్ తమ్మేవార్ భగవాన్ సెట్ మేనూర్ గ్రామ సర్పంచ్ విట్టల్ గురూజీ గ్రామ సర్పంచ్ సంతోష్ పటేల్ మండలంలోని పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పత్తి కొనుగోలు వ్యాపారులు కమిషన్ ఏజెంట్లు మార్కెట్ కమిటీ సిబ్బంది పత్తి రైతులు తదితరులు పాల్గొన్నారు.