బస్సులో ప్రయాణించిన ఎమ్మెల్యే జారే

– ప్రయాణీకుల ప్రాంగణం ఆహ్లాదంగా ఉండాలి

నవతెలంగాణ – అశ్వారావుపేట
బస్టాండ్ లో ప్రయాణీకుల ప్రాంగణం ఆహ్లాదంగా ఉండాలని,బస్సు ఎక్కి దిగేటప్పుడు ప్రయాణీకులకు సౌకర్యవంతంగా ప్లాట్ ఫాం తయారు చేయాలని స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ కంట్రోలర్ లు గార్లపాటి రంగారావు,నార్లపాటి సునీత ల ను ఆదేశించారు. ఆయన శుక్రవారం మండల పరిధిలోని నారాయణపురం లో జరిగే కట్ట మైసమ్మ జాతర కు వెళ్తూ మందల పల్లి నుండి అశ్వారావుపేట వరకు 15 కిలో మీటర్లు ప్రయాణీకుల తో ప్రయాణించారు.అనంతరం బస్టాండ్ లో నాయకుడు ముబారక్ ఏర్పాటు చేసిన  కుండీల్లో పూలమొక్కలు నాటారు.ఈ సందర్భంగా ప్రయాణీకుల ప్లాంట్ ఫాం లు ధ్వంసం అయిన ఉండటాన్ని గమనించిన ఆయన వాటిని మరమ్మత్తులు చేసి ప్రయాణీకులు కు సౌకర్యవంతంగా ఉండాలని సిబ్బంది సూచించారు.ఈ కార్యక్రమంలో ఎం.పి.టి.సి లు వేముల భారతి ప్రతాప్,మిండ హరిక్రిష్ణ,పి.ఎ.సి.ఎస్ అశ్వారావుపేట అద్యక్షులు చిన్నం శెట్టి సత్యనారాయణ,సుంకవల్లి వీరభద్రరావు, నాయకులు తుమ్మ రాంబాబు,కానూరి మోహన్ రావు,రేమళ్ళ కేదార్ నాధ్,నండ్రు రమేష్ లు ఉన్నారు.
Spread the love