నవతెలంగాణ – అమరావతి
విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 13 వరకు నామినేషన్ల స్వీకరణ, 30న పోలింగ్, సెప్టెంబర్ 3న ఓట్ల లెక్కింపు ఉంటుంది. జీవీఎంసీ కార్పొరేటర్లు, యలమంచిలి, నర్సీపట్నం మున్సిపాలిటీల కౌన్సిలర్లు, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు ఓటు హక్కు వినియోగించుకుంటారు. మొత్తం 838 ఓట్లు ఉండగా, వైసీపీకి 615, కూటమికి 215 ఓట్లు ఉన్నాయి. వైసీపీ అభ్యర్థిగా బొత్సను ఎంపిక చేయగా, కూటమి ఇంకా పేరు ఖరారు చేయలేదు.