నవతెలంగాణ – హైదరాబాద్ : మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఫలితాలు నేడు వెలువడనున్నాయి. మహబూబ్‌నగర్‌లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఉ.8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. మొత్తం 1,439 ఓట్లలో 1,437 పోలయ్యాయి. ఈ ఎన్నికలో మన్నె జీవన్‌రెడ్డి(కాంగ్రెస్), నవీన్‌కుమార్ రెడ్డి(బీఆర్ఎస్), సుదర్శన్ గౌడ్(స్వతంత్ర) పోటీ చేశారు. ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి ఎమ్మెల్యేగా గెలవడంతో ఈ ఉపఎన్నిక వచ్చింది.