నవతెలంగాణ – గోవిందరావుపేట
ఖమ్మం వరంగల్ నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డిని గెలిపించాలంటూ శుక్రవారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ ముఖ్య నాయకులు విస్తృత ప్రచారం నిర్వహించారు. పార్టీ బలపరిచిన అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయాలి జిల్లా పరిషత్ ఛైర్పర్సన్, నియోజకవర్గ ఇంచార్జి బడే నాగజ్యోతి అన్నారు.ఏనుగుల రాకేష్ రెడ్డి గెలుపు చారిత్రక అవసరం ఎంఎల్ సి ఎన్నికల ములుగు నియోజకవర్గ ఇంచార్జి అసిఫాబాద్ ఎంఎల్ఏ కోవ లక్ష్మీ పేర్కొన్నారు.ప్రతి పట్టబధ్ర ఓటరు బి ఆర్ ఎస్ పార్టీ వైపే ఉన్నాడు ఈ ఎన్నికల ఫలితాలలో ఈ విషయం తేట తెల్లం అవుతుంది పోరిక గోవింద్ నాయక్ గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ ప్రచారంలో పేర్కొన్నారు. స్థానిక ఎంపీపీ సూడి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ విజ్ఞుడైన ప్రతి పట్టబద్రుల ఓటరు తన సహచర విజ్ఞుడైన పట్టబద్రుడు, ఉన్నత విద్యావేత్త, సామాజిక సేవకుడు ఏనుగుల రాకేష్ రెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు బొల్లం శివ, ఫక్రుద్దీన్, మాజీ సర్పంచ్ దేవనాయక్, మాజీ ఉప సర్పంచ్ అల్లంనేని హనుమంత రావు, వగా నాయక్, మోహన్ రాథోడ్, సూరినేని రవీందర్, రుద్రబోయిన మల్లేష్ గౌడ్, ఈర్ల అజయ్,మాదాసు గురునాథ్, నమవరపు గాంధీ,ఇంద్ర రెడ్డి, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.