నవతెలంగాణ-పరిగి
ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డిని వెంటనే భర్త రఫ్ చేయాలని పరిగి నియోజకవర్గ ముదిరాజ్ సలహాదారులు హనుమం తు ముదిరాజ్ అన్నారు. ఆదివారం పరిగి పట్టణ కేంద్రంలో యూట్యూబ్ రిపోర్టర్ అజరు ముదిరాజ్‌ను కిడ్నాప్ చేసి, చంపేస్తానని బెదిరిస్తూ కొట్టిన ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డిని వెం టనే బర్తరఫ్ చేయాలని పరిగి నియోజకవర్గం ముదిరాజుల ఆధ్వర్యంలో బస్టాండ్ ఎదుట ధర్నా నిర్వహించారు. కొడంగల్ చౌరస్తా నుంచి పరిగి బస్టాండ్ వరకు కౌశిక్‌రెడ్డి దిష్టిబొమ్మతో శవయాత్ర చేసి, దిష్టిబొమ్మను దహనం చే శారు. ఈ సందర్భంగా పరిగి నియోజకవర్గం ముదిరాజ్ గౌరవ అధ్యక్షులు రామచంద్రయ్య, అధ్యక్షులు రామస్వా మి, సలహాదారులు హనుమంతు ముదిరాజ్, జిల్లా ప్రధా న కార్యదర్శి డి.మాణిక్యం, పరిగి మండల వైస్ ఎంపీపీ సత్యనారాయణ, జేఏసీ చైర్మన్ ముకుంద నాగేశ్వర్ మా ట్లాడుతూ ముదిరాజ్ కులాన్ని అవమానపరిచే విధంగా మాట్లాడిన కౌశిక్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ ఉద్యోగులు సంఘం జిల్లా అధ్యక్షులు రామకృష్ణ, దనేశ్వరర్, ముదిరాజ్ సంఘం నాయకులు శేరి బిచ్చయ్య, నర్సింలు, కుడముల యాద య్య, ముకుంద శేఖర్, పర్షమోని బాబు, శ్రీశైలం, రమేష్, నందు, జానర్థన్, హనుమంత్, సత్యనారాయణ, శ్రీను, శివలింగం, తేజ, సాగర్, యాదయ్య, చందు, తదితరులు పాల్గొన్నారు.