నవతెలంగాణ – వీణవంక
మండల కేంద్రంలోని పోచమ్మ ఆలయంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి కుటుంబ సమేతంగా ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు వీణవంకలోని స్వగృహం నుండి ఆయన సతీమణి శాలిని రెడ్డి, కూతురు స్నేహికా రెడ్డి తో కలిసి ప్రత్యేక బోనంతో ఆలయానికి వెళ్లి వెళ్లారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్డిపల్లి సర్పంచ్ పోతుల నరసయ్య, వీణవంక ఉపసర్పంచ్ ఓరం భానుచందర్, వార్డు సభ్యులు బిక్షపతి, సంపత్ తదితరులు పాల్గొన్నారు.