నిరుపేద సరస్వతి పుత్రునికి ఎమ్మెల్సీ కవిత ఆర్థిక చేయూత

నవతెలంగాణ- కంటేశ్వర్

నిరుపేద సరస్వతి పుత్రునికి ఎమ్మెల్సీ కవిత చేతను అందించారు మరోసారి పెద్దమనుషులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చాటుకున్నారు విదేశాలలో ఉన్నత విద్యకు ఆర్థిక ఆటంకం ఏర్పడిన యువకుడికి భరోసా ఎమ్మెల్సీ కవిత కల్పించారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి తన పెద్దమనుసు చాటుకున్నారు. అభాగ్యులకు ఎప్పుడు అండగా నిలబడే ఆమె తాజాగా నిజామాబాద్ కు చెందిన ఓ నిరుపేద యువకునికి ఉన్నత విద్యాభ్యాసం కోసం ఆర్థిక చేయూత అందించారు.. నగరానికి చెందిన సామల రితీష్ కు అమెరికాలోని నార్త్ వెస్ట్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ సీటు లభించింది.కానీ చిన్న ఉద్యోగం చేస్తూ తన కుటుంబాన్ని పోషించే రితీష్ తండ్రి అమెరికాకు తన కొడుకుని పంపించే స్తోమత లేక ఇబ్బందుల పాలు అయ్యారు. ఈ విషయాన్ని రితీష్ ఎమ్మెల్సీ కవిత కి తెలియజేశారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్సీ కవిత రితీష్ అమెరికాకు వెళ్లడానికి అవసరమయ్యే ఖర్చులను భరించారు. వారికి టికెట్ను సొంత ఖర్చులతో ఇప్పించారు.. తన కలను సాకారం చేసుకునేందుకు ఆర్థిక చేయూత అందించి అండగా నిలబడిన ఎమ్మెల్సీ కవితకు రితీష్ కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.
Spread the love