పేద విద్యార్థికి ఎమ్మెల్సీ కవిత ఆర్థిక చేయూత

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఓ పేద విద్యార్థి విదేశీ చదువుకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆర్థిక సహాయం చేశారు. నిజామాబాద్‌ పట్టణానికి చెందిన సామల రితీష్‌కు అమెరికాలోని నార్త్‌ వెస్ట్‌ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్‌ సీటు లభించింది. చిన్న ఉద్యోగం చేస్తూ తన కుటుంబాన్ని పోషించే రితీష్‌ తండ్రి అమెరికాకు తన కొడుకుని పంపించే ఆర్థిక స్థోమత లేక, విషయాన్ని ఎమ్మెల్సీ కవిత దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై వెంటనే స్పందించిన ఆమె రితీష్‌ అమెరికాకు వెళ్లడానికి అవసరమయ్యే ఖర్చులను భరించారు. సొంత డబ్బుతో టిక్కెట్‌ కొని ఆర్థిక చేయూత ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవితకు రితీష్‌ కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.

Spread the love