మోడీ పెద్దన్న ఎలా అవుతారు..రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం

నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోడీని సీఎం రేవంత్ రెడ్డి పెద్దన్న అని సంబోధించడం మీద బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రియాక్ట్ అయ్యారు. సోమవారం మీడియా తో ఆమె మాట్లాడుతూ అదిలాబాద్లో ప్రధాని మోడీని రేవంత్ రెడ్డి పెద్దన్నని సంబోధించారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకి ఒక్క రూపాయి కూడా ఇవ్వని మోడీ ఎలా పెద్దన్న అవుతాడు రేవంత్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల మీద బీజేపీ కాంగ్రెస్ ఒక్కటే అని అర్థమవుతుందని అన్నారు. ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన జీవో నెంబర్ 3 తో ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీలో మహిళలకు తీవ్ర అన్యాయం జరిగిందని చెప్పారు. తక్షణమే జీవో నెంబర్ త్రీ ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు జీవో నెంబర్ 3 కి వ్యతిరేకంగా ఈనెల 8న మహిళా దినోత్సవ నాడు ధర్నా చౌక్లో నల్ల రిబ్బన్ల తో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు

Spread the love