నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఆంధ్రప్రదేశ్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పీ గన్నవరం మండలం ముంగండ గ్రామంలో ముత్యాలమ్మ అమ్మవారి ఆలయ పున:ప్రతిష్ట కార్యక్రమంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఆదివారం నాడామె అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రజలు సుఖసంతోషాలతో వర్థిల్లాలనీ, రెండు రాష్ట్రాలు అభివృద్ధిలో అగ్రగామిగా నిలవాలని ప్రార్థించినట్టు తెలిపారు. 400 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన ముత్యాలమ్మ అమ్మవారి పున:ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొనడాన్ని అదృష్టంగా భావిస్తున్నాని చెప్పారు.