శంషాబాద్‌కు చేరుకున్న ఎమ్మెల్సీ కవిత..

నవతెలంగాణ – హైదరాబాద్: నిజామాబాద్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శంషాబాద్‌ విమానాశ్రయం చేరుకున్నారు. ఢిల్లీ నుంచి శంషాబాద్‌కు చేరుకున్న కవితకు బీఆర్ఎస్‌ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. ఈ సందర్భంగా గులాబీ నేతలు, కార్యకర్తలు కవితపై పూలవర్షం కురిపించగా.. పార్టీ శ్రేణులకు కవిత అభివాదం చేశారు. పడికిలి బిగించి జై తెలంగాణ అంటూ నినదించారు. కార్యకర్తల జై తెలంగాణ నినాదాలతో ఎయిర్‌పోర్ట్‌ దద్దరిల్లింది.

Spread the love