ఎమ్మెల్సీ మూడో పెళ్లి

నవతెలంగాణ కైకలూరు: వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ (Jayamangala Venkata Ramana) మూడో వివాహం చేసుకున్నారు. అయితే ఈ వివాహనికి రెండో భార్య సాక్షి సంతకం చేశారు. వివరాల్లోకి వెళ్లితే ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ ఏలూరు రేంజ్ (Eluru) అటవీ శాఖలో సెక్షన్ అధికారిణిగా పనిచేస్తున్న సుజాతను కైకలూరు సబ్ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో వివాహం చేసుకున్నారు.
కైకలూరు సబ్ రిజిస్ట్రార్‌.. వివాహ ధ్రువీకరణ పత్రాన్ని వారికి అందజేశారు. వెంకటరమణ మొదటి భార్య అనారోగ్యంతో చనిపోయారు. వారికి ఒక కుమార్తె ఉన్నారు. తర్వాత సునీతను రెండో వివాహం చేసుకోగా,  వారికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ మూడో వివాహం చేసుకుంటున్న సుజాతకు ఇది రెండో వివాహం. ఆమెకు కూడా ఒక కుమారుడు ఉన్నాడు. జయమంగళ రెండో భార్య సునీత, కుమారుడి సమక్షంలో ఈ వివాహం జరిగింది.

Spread the love