మృతుని కుటుంబానికి ఎమ్మార్పీఎస్ ఆర్థిక సహాయం

నవతెలంగాణ-గోవిందరావుపేట : మండలంలోని పసర గ్రామ ఎస్సీ కాలనీలో గత నెల 30వ తారీఖున అనారోగ్యంతో మృతి చెందిన అంబాల బాబు కుటుంబానికి శనివారం ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో జిల్లా నాయకులు మడిపల్లి శ్యాంబాబు ఆర్థిక సహాయాన్ని అందించి ఓదార్చారు. ఈ సందర్భంగా శ్యాంబాబు మాట్లాడుతూఅంబాల బాబు  అకాల మరణాన్ని దండోరా మాదిగ జాతి పక్షాన చింతిస్తున్నామన్నారు.అట్టడుగు బలహీనవర్గాలుగా జీవిస్తున్నటువంటి  మాదిగ మరియు ఉపకులాల కు తోడుగా నిత్యం ప్రజలలో ఉంటూ  సామాజిక బాధ్యతగా గుర్తించి మాదిగ జాతిలో ఎవరికి ఎలాంటి కష్టం ఎదురైనా ఎలాంటి ఆపద వచ్చిన ముందు మాదిగ దండోరా మాత్రమే  ఉంటుందని దండోరా నాయకుల శ్రామికులుగా, ఆసరాగా సమాజానికి మారుతారని గుర్తు చేస్తూన్ననాని అన్నారు.అంబాల బాబు అన్న విషయానికొస్తే  మాదిగ జాతి లో వారి కుటుంబానికి పెద్దదిక్కుగా మారి కుటుంబం సరిదిద్దుకుంటున్న సమయంలోనే కాలం చేయడం అనేది చాలా బాధాకరం…. కుటుంబానికి పెద్దదిక్కుగా అన్న లేనప్పటికీ  ఇకనుండి  మాదిగ దండోరా  పెద్ద దిక్కుగా  ఉంటుందని  భావిస్తున్నామన్నారు.అంబాలా బాబు కి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ దిశ దిన కర్మకు కుటుంబానికి చేయూతగా  50కేజీల బియ్యం అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల గ్రామ సీనియర్ నాయకులుతిక్క దుర్గారావు, పసుల భద్రయ్య, సుంచు యాకోబు, మునిగాల సాంబయ్య, వేల్పుల దుర్గ ప్రశాంత్, పురుషోత్తం, తిప్పనపల్లి సురేష్ ,గడ్డం లడ్డు,అంబల గోవర్ధన్,తదితరులు పాల్గొన్నారు.
Spread the love