ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం

నవతెలంగాణ-వీణవంక
ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని మండల కేంద్రంలో  ఆ పార్టీ నాయకులు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం సీనియర్ నాయకుడు గాజుల రామయ్య జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రామయ్య మాట్లాడుతూ ఎస్సీలల్లో ఏబీసీడీ వర్గీకరణ కోసం 28 సంవత్సరాలకు పైబడి పోరాటాలు చేస్తున్నా ప్రభుత్వాలు స్పందించడం లేదని వాపోయారు. ప్రభుత్వం స్పందించి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు అంబాల మధునయ్య, పులి ప్రకాష్, కండె మహేందర్, తిరుపతి, స్వామి, చందు, రాజేష్, మధు, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love