ఎస్సీ ఎబిసిడి వర్గీకరణ కోసం సుప్రీంకోర్టు తీర్పు చెపుతూ రిజర్వేషన్లు అమలు కోసం రాష్ట్రాలకు అధికారం ఇవ్వడం తెలంగాణ రాష్ట్రంలో సుప్రీంకోర్టు తీర్పుకు వెంటనే అమలు చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ముగిసిన రాష్ట్ర అసెంబ్లీ సమావేశంలో ప్రకటించారు. ఈ సందర్భంగా ఎస్సీ వర్గీకరణ విజయోత్సవ సభ బిచ్కుంద మండల కేంద్రంలో ఆదివారం జరిగిన కార్యక్రమానికి మద్నూర్ మండలం నుండి గ్రామ గ్రామం నుండి డప్పులతో ఎమ్మార్పీఎస్ నాయకులు బిచ్కుంద కు తరలి వెళ్లారు. మండల కేంద్రం నుండి బ్యాండ్ బాజతో తరలివెల్లగా పల్లెటూర్ల ఎమ్మార్పీఎస్ నాయకులు డప్పులతో బయలుదేరారు.