పాఠశాల విద్యార్థులకు మాక్‌ పోలింగ్‌

Mock polling for school studentsనవతెలంగాణ-లక్షెట్టిపేట
పట్టణంలోని శ్రీ చైతన్య టెక్నో పాఠశాలలో విద్యార్థులకు ప్రజాస్వామ్యం, ఎన్నికల ప్రాముఖ్యతను అర్థమయ్యే విధంగా మంగళవారం మాక్‌ పోలింగ్‌ నిర్వహించారు. ఈ మాక్‌ పోలింగ్‌ ద్వారా విద్యార్థులు ఓటరుగా, అభ్యర్థులుగా మారి ప్రచారం నిర్వహించే విదానాన్ని వివరించారు. దీని ద్వారా విద్యార్థులకు నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యత, ప్రజాస్వామ్యంపై అవగాహన కలిగి ఉంటారని ఆ పాఠశా ప్రిన్సిపాల్‌ అశ్విని తెలిపారు. ఈ కార్యక్రమంలో జోనల్‌ పీఈటీ రాజేందర్‌, అకాడమిక్‌ డీన్‌ శ్రీనివాస్‌, పీఈటీ కిషన్‌, అకౌంటెంట్‌ సురేష్‌ పాల్గొన్నారు.

Spread the love