దేశంలో మోదానీ మోసాలు

సెక్యులర్‌ స్టేట్‌గా భారతదేశం ప్రపంచానికే ఆదర్శ రాజ్యంగా ఒకనాడు వెలుగొందింది. ఈ దేశాన్ని 2014 నుంచి పరిపాలిస్తున్న కార్పొరేట్‌, హిందూత్వ కూటమి ఎలాంటి దారుణమైన నీచాలకు ఒడిగట్టిందో హిండెన్‌బర్గ్‌ నివేదిక బైటపెట్టింది.
తనపై, తన (అక్రమ) వ్యాపార సామ్రాజ్యం మీద వచ్చిన ఆరోపణల్ని స్పందిస్తూ ఆదానీ ‘అది భారతదేశం మీద తలపెట్టి దాడి’గా అభివర్ణించాడు. మోడీ ప్రభుత్వం బిబిసి డాక్యుమెంటరీలను నిషేధించింది. ఆశ్రత పెట్టుబడిదారీ విధానం భారతదేశపు జాతి సంపదను కొల్లగొడుతోంది. సంక్షేమం వదలి భారాలు మోపే మోడీ పాలనను అంకెలు, సంఖ్యలు, సంవత్సరాల వారీగా లెక్కలతో చెపుతూ కార్పొరేట్‌, మతతత్త్వ కూటమి కుట్రలను ఎరుక చేశారు సీతారాం ఏచూరి తన వ్యాసంలో (పేజీ 3).
అదానీ వ్యవహారంపై హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ నివేదిక, ముఖ్యాంశాలు వివరంగా ఈ చిన్న పుస్తకంలో 4 పేజీల్లో క్లుప్తంగా చెప్పారు (పేజీ 6).
దోపిడీ, అవినీతి, అక్రమసంపాదన ఎలా కొనసాగుతోందో, అదానీ గ్రూప్‌ కంపెనీల విషయాలు నీలోత్పల్‌ బసు తన వ్యాసంలో వివరించారు. గౌతమ్‌ ఆదానీ అధిపతిగా ప్రవేట్‌రంగం ఎంతో బలంగా ఈ దేశాన విస్తరించింది. ఓడరేవుల నిర్వహణ/ విద్యుదుత్పత్తి/ బొగ్గుగనులు/ ముడిచమురు/ సహజ వాయువు/ గ్యాస్‌ పంపిణీ / భవన నిర్మాణాలు – మౌలిక వసతుల ప్రాజెక్ట్‌లు, వివిధ రంగాల్లోని ప్రాజెక్టులు అంతర్జాతీయ వాణిజ్యం – విద్య, రియల్‌ ఎస్టేట్‌/ వంట నూనెలు/ విమానాశ్రమాల నిర్వహణ/ ఆహార ధాన్యాలు నిల్వచేయడం… ఇలా ఆదానీ గుత్తాధిపత్యం 28 ఏదశాల్లో 30 రకాల సరుకుల వాణిజ్యం, విస్తరణ మోడీకి అండగా ‘రిసర్జెంట్‌ గ్రూప్‌ ఆఫ్‌ గుజరాత్‌’ సంస్థను స్థాపించడం లాంటి విషయాలు. 2001 నాటికి 3,741/- కోట్ల నుండి 2014 నాటికే 75, 659 కోట్లకు ఎగబాకిన తీరు ఈ వ్యాసంలో చెప్పారు. 2014లో ప్రపంచ కుబేరుల్లో 609 స్థానంలోని ఆదానీ 2022 నాటికి 2వ స్థానంలోకి ఎలా వచ్చి చేరాడో తెల్పుతుంది బసు వ్యాసం.
జాతీయ ఆర్థిక సంస్థలైన ఎస్‌బిఐ, ఎల్‌ఐసి వంటి సంస్థలను అడ్డగోలుగా వాడుకుని ప్రవేట్‌ వ్యక్తుల సామ్రాజ్యాల విస్తరణను క్రోనీ కేపిటలిజం (ఆశ్రిత పెట్టుబడిదారీ విధాన) గుట్టువిప్పిన వ్యాసం ప్రభాత్‌ పట్నాయక్‌ రాశారు. రూపాయికి కొన్న దాన్ని మన జెన్‌కో 10 రూపాయలకు అమ్మే ఆదానీ దోపిడీని ఎం.వి.ఎస్‌.శర్మ తన వ్యాసంలో చెప్పారు. ఆశ్రిత విధానాలు ‘జాతీయ ప్రయోజనాలు’ భ్రాంతి కలిగించే పాలకుల విధానాన్ని సంజరురారు వివరించారు. ఆదానీ దోపిడీపై కమిటీలతో కాలయాపనపై కోటేశ్వరరావు వివరించారు. మంచి విలువైన సమాచారం గల ఈ పుస్తకం రాజకీయ కార్యకర్తలకు కరదీపిక.
– తంగిరాల చక్రవర్తి, 9393804472 

Spread the love