– శేరిలింగంపల్లిలో 5.7 సెంటీమీటర్లు నమోదు
– వచ్చే రెండ్రోజులు వర్షాలు!
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలో పలుచోట్ల మోస్తరు వర్షం కురిసింది. సోమవారం రాత్రి పది గంటల వరకు కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేటలో అత్యధికంగా 7.18 సెంటీమీటర్ల వర్షం పడింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని శేరిలింగంపల్లిలో అత్యధికంగా 5.75 సెంటీమీటర్లు, తిరుమలగిరిలో 5.48 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్ చుట్టూతా, ఆనుకుని ఉన్న సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో ఎక్కువ ప్రాంతాల్లో వర్షం పడింది. సోమవారం రాత్రి 10 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 411 ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. గ్రేటర్ పరిధిలోనే 104 ప్రాంతాల్లో వర్షం కురిసింది. రాష్ట్రంలో వచ్చే రెండ్రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వానలు, ఒకటెండ్రు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి కె.నాగరత్న తెలిపారు.