నవతెలంగాణ – హైదరాబాద్: బంగాళఖాతంలో ఎర్పడిన ఆల్పపీడనానికి తోడు.. ఉపరితల ఆవర్తనం ఏర్పడటంతో తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు వర్షాలు పడుతున్నాయి. ఈ క్రమంలోనే శనివారం తెలంగాణలోని కరీంనగర్, భూపాలపల్లి, మెదక్, నిజామాబాద్ జిల్లాలో వర్షాలు కురిశాయి. అలాగే శనివారం రాత్రి సిద్దిపేట జిల్లాలో భారీ వర్షం కురిసింది. అలాగే అల్పపీడనం తుఫానుగా మారడంతో తెలంగాణ వ్యాప్తంగా మేఘాలు కమ్ముకున్నాయి. దీంతో చలి తీవ్రత తగ్గి పలు ప్రాంతాల్లో ముసురు పట్టుకుంది. ముఖ్యంగా హైదరాబాద్ ను మేఘాలు పూర్తిగా కమ్మేశాయి. దీంతో ఆదివారం తెల్లవారుజాము నుంచి అనేక ప్రాంతాల్లో ముసురు కురుస్తుంది. ముఖ్యంగా ఖైరతాబాద్, లక్డీకపూల్, ప్రగతి నగర్, పంజాగుట్టా చార్మినార్, కోటి, హిమాయత్ నగర్, అమీర్ పేట్, జూబ్లీ హిల్స్, మియాపూర్, బీరంగూడ కూకట్ పల్లి, బంజారాహిల్స్, ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది.