ఆధునిక పద్ధతిలో పంటల సాగు

– పంటలు పరిశీలించిన జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి
నవతెలంగాణ- మద్నూర్ 
జిల్లా వ్యవసాయ అధికారి భాగ్య లక్ష్మి  మద్నూర్ మండలములో వానాకాలంలో సాగు చేస్తున్న పంటలను బుధవారం నాడు పరిశీలించడం పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ.. ఏ ఈ ఓ లు రైతులకి అందుబాటులో ఉండి సాగు చేస్తున్న పంటలను ఎప్పటి కప్పుడు సర్వే నంబర్ వారీగా నమోదు చేయాలని సూచించారు. ముఖ్యంగా ఆధునిక పద్ధతిలో  సాగు  అధిక దిగుబడినిచ్చే సోయా పంటలో కంది సాగు చేస్తున్న రైతు పాకల్వర్ రమేష్ పొలన్నీ సందర్శించి తగు సూచనలు చేశారు. రైతులు  పప్పు ధాన్యాలు సాగు చేస్తే లాభదాయకం ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రాజు, మద్నూర్ గ్రామ సర్పంచ్ సురేష్  ఏ ఈ ఓ లు ప్రియాంక, అనిల్, శ్రీ లేఖ, రైతులు రమేష్ , రాజేష్ తదిరులు పాల్గొన్నారు.
Spread the love