
నవతెలంగాణ కంఠేశ్వర్
కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో తెలంగాణకు మళ్ళీ నిరాశనే మిగిల్చింది. తెలంగాణపై కేంద్రానికి వున్న నిర్లక్ష్యాన్ని మోడీ ప్రభుత్వం చూయించింది. రాష్ట్రం నుండి ఇద్దరు కేంద్రంలో సహాయక మంత్రులుగా వున్నప్పడికి రాష్ట్రానికి నిధులు తేవడంలో విఫలం అయ్యారు. ధర్మపురి అరవింద్ ఐదు సంవత్సరాలు ఎంపీ గా వుండి ఇప్పుడు మళ్ళీ ఎంపీ అయిన కూడా తన ప్రవర్తనలో ఆలోచనలో మార్పు రాలేదు. తెలంగాణ నుండి బిజెపి కి నలుగురు వున్న ఎంపీలు రెట్టింతలు అయి ఎనిమిది మంది అయిన కూడా రాష్ట్రానికి నిధులు రాకుండా రాష్ట్రాన్ని ఎనిమిది ఇంతలు మోసం చేశారు. ఇది రాష్ట్రం పైన కేంద్ర ప్రభుత్వానికి వున్న చిన్న చూపుకు నిదర్శనం.