తెలంగాణపై మరోసారి అక్కసు వెల్లగక్కిన మోడి

– బీఆర్ఎస్ యువ నాయకులు ఉప్పరి విజయ్
నవతెలంగాణ – బోడుప్పల్: పార్లమెంట్ సమావేశాల సందర్బంగా నరేంద్ర మోడీ వ్యాఖ్యలు తెలంగాణ ఉద్యమాన్ని , అమరవీరుల త్యాగాన్ని అవహేళన చేసే విధంగా ఉన్నాయని, 60 యేండ్ల కలను అనేక ఉద్యమాలు, ప్రాణత్యాగాలను ప్రదాన మంత్రి నరేంద్ర మోడీ మరోసారి హేళన చేసేలా మాట్లాడడం సరికాదని బోడుప్పల్ బీఆర్ఎస్ యువజన విభాగం నేత ఉప్పరి విజయ్ మండిపడ్డారు. కెసిఆర్ సారథ్యంలో స్వరాష్ట్రాన్ని సాధించుకున్నాం. సాధించుకున్న రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో బంగారు తెలంగాణ దిశగా తీర్చిదిద్దుతున్నారు. తెలంగాణ విభజన హామీ చట్టంలో తెలంగాణకి రావాల్సిన విద్యాసంస్థలు, పరిశ్రమలు, నిధులు కేటాయించకుండా కాలయాపన చేస్తూ, తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న బీజేపీ ప్రభుత్వం, నేడు ప్రధానమంత్రి హోదాలో ఉండి రాష్ట్రాల విభజన సహేతుకంగా లేదని చెప్పడం సిగ్గుచేటు.తెలంగాణ బీజేపీ నాయకులకు తెలంగాణ ప్రజల పట్ల , జరుగుతున్న అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి ఉంటె నరేంద్ర మోడీ మాటలను ఖండించాలని డిమాండ్ చేస్తున్నాం. నరేంద్ర మోడీ తన మాటలను వెనక్కి తీసుకొని తెలంగాణ ప్రజలకు, అమరవీరులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం.

Spread the love