నేడు ఇటలీకి ప్రధాని మోడీ..

నవతెలంగాణ-హైదరాబాద్ : జీ-7 దేశాల 50వ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ నేడు ఇటలీ వెళ్లనున్నారు. మూడోసారి పీఎం పదవి చేపట్టాక మోడీకిది తొలి విదేశీ పర్యటన కావడం విశేషం. ఈ సమావేశాలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్, జపాన్ పీఎం ఫ్యూమియో కిషిడా, కెనడా పీఎం జస్టిన్ ట్రూడో తదితరులు హాజరుకానున్నారు. మూడు రోజులపాటు జరిగే ఈ సదస్సులో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, గాజా సంఘర్షణలపై చర్చించనున్నారు.

Spread the love